పురాతన రోమన్ జాడీలో 1600 ఏళ్ల నాటి మానవ అస్థిపంజరం వెలుగులోకి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
బల్గేరియాలోని పురాతన రోమన్ కాలనీ డెల్టుమ్‌లో దాదాపు 1600 ఏళ్ల కిందటి మానవ అస్థిపంజరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. భీకరమైన అగ్నిప్రమాదం సమయంలో ఒక యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద మట్టి జాడీలో దాక్కుని అక్కడే సజీవసమాధి అయ్యాడని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దాడుల సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని ఈ అరుదైన అవశేషాలు స్పష్టం చేస్తున్నాయి.