పేదల ఆరోగ్య భద్రతకు అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు రూ. 49.45 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవిందరావు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.