నేటితో ఘనంగా ముగియనున్న బ్రిక్స్ సదస్సు-2026

రిపోర్టర్: గోపి స్థలం: India

అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బ్రిక్స్ సదస్సు-2026 నేటితో అధికారికంగా ముగియనుంది. భారత్ మండపంలో జరిగే ఈ ముగింపు వేడుకల్లో ప్రపంచ దేశాల నేతలు గ్రూప్ ఫోటో దిగనున్నారు. అనంతరం ప్రధాన ఓపెన్ సెషన్‌లో కీలక అంశాలపై చర్చించి, ప్రతిష్టాత్మక 'ఢిల్లీ డిక్లరేషన్'ను అధికారికంగా విడుదల చేయనున్నారు. తొలి రోజు విశేషాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.