రాజాపేట మండలంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతున్న దేవిశ్రీ నవరాత్రి ఉత్సవాలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో దేవిశ్రీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ గ్రామాల్లో ప్రతిష్టించిన అమ్మవారు ఆదివారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులు అలంకార విశిష్టతను వివరించగా పలువురు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు.