రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విద్యార్థిని భవ్యరాణి
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జడ్పీ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థిని సింగం భవ్యరాణి హాకీ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఇటీవల మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి అండర్-14 విభాగ పోటీల్లో ఆమె సత్తా చాటింది. ఈ విజయం ద్వారా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు రామదేవి తెలిపారు. క్రీడల్లో విద్యార్థిని రాణించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.