ఈడిగపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన మందా సుధామణి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం మాలేమార్పూరం పరిధిలోని ఈడిగపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మందా సుధామణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ నమూనాను ఓటర్లకు చూపిస్తూ తనకు మద్దతు తెలపాలని ఆమె కోరారు. గ్రామాభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్థానిక ప్రజల ఎదుట స్పష్టం చేశారు.