ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హెల్త్ కార్డులు ఇస్తామన్న నర్సింగరావు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. గద్వాలలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాలలో స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను గురువారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి కార్డుల్లో వివరాలు నమోదు చేస్తామని, పౌష్టికాహారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో సంధ్య కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.