విద్యార్థినులకు భద్రతపై విశాఖ పోలీసులు ప్రత్యేక అవగాహన

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ద్వారకా మరియు వెస్ట్ సబ్-డివిజన్ పరిధిలోని పాఠశాల విద్యార్థినుల కోసం శక్తి టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నివారణపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ నివారణ చర్యలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించి విద్యార్థులలో భద్రతా భాగాన్ని పెంపొందించారు.