రోడ్డు ధ్వంసం ఘటన: నిందితులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాలంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Tirupati

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో కొత్తగా నిర్మించిన రహదారిని ధ్వంసం చేసిన ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, నిందితులపై వెంటనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాధనంతో నిర్మించిన మౌలిక వసతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.