స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తతలు: వైఎస్సార్సీపీ నేతలపై కేసులు, గృహనిర్బంధాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో చెలరేగిన ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. వీడియో ఆధారంగా దాదాపు ది మందిని గుర్తించిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.