గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో వెంబడించి ఢీకొట్టిన ఆకతాయిలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హరియాణా

హరియాణాలోని గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వెళ్తున్న మహిళను కారుతో వెంబడించి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. ఈ ప్రమాద దృశ్యాలు బైక్ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.