పంచాయతీ నిధుల జమపై సంబరాల్లో మునిగిపోయిన మల్యాల నాయకులు
రిపోర్టర్: Ajay
స్థలం: మల్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు జమ చేసేలా అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెవులమద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. స్థానిక సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిర్ణయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.