డ్రోన్ పైలట్ లా కనిపిస్తున్నారంటూ కిరణ్ అహిర్వార్ ను ప్రశంసించిన కేంద్ర మంత్రి సింధియా

రిపోర్టర్: మహేష్ స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లోని గునా జిల్లా బర్ఖేడా గిర్ద్ గ్రామంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో నామో డ్రోన్ దీది కిరణ్ అహిర్వార్ వ్యవసాయ డ్రోన్ ను నడిపి తన ప్రతిభను ప్రదర్శించారు. కిరణ్ ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యాన్ని కేంద్ర మంత్రి సింధియా అభినందిస్తూ ఆమెను సాధారణ గ్రామీణ మహిళలా కాకుండా విమాన పైలట్ లా చూస్తున్నానని ప్రశంసించారు.