యువతలో గుండె ముప్పు పెరుగుతుందన్న యశోద వైద్యులు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
యువత ఎలాంటి గుండె సమస్యలు రావని నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని యశోద హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ మదిరెడ్డి స్పష్టం చేశారు. ఆధునిక జీవనశైలి, హైబీపి, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు ముప్పై ఏళ్ల వయసువారికీ ముప్పు తెస్తాయని ఆయన హెచ్చరించారు. నిత్యం సరైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేసుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చని వెల్లడించారు.