కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మస్తు గోస పడుతున్నాం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన తర్వాత తమకు పనులే దొరకడం లేదని ఓ కార్మికుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు మస్తు గోస పడుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని పూర్తిగా మరిచిపోయిందని కార్మికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.