యలహంక వేదికపై వివాదాల నేపథ్యంలో కుమార్తె వివాహం వేరే చోట: వైఎస్ షర్మిల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Amaravati

తన కుమార్తె అంజిలి వివాహ వేడుకను యలహంక కుటుంబ ఆస్తిలో కాకుండా వేరే ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా తనకు, తన పిల్లలకు పూర్తిగా చెందిందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ ఇల్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.