ది ప్యారడైజ్ చిత్రానికి టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్‌కు అనుమతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

ఈ నెల 24న విడుదల కానున్న నాని పాన్‌ ఇండియా చిత్రం ది ప్యారడైజ్‌కి రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు మరియు సెప్టెంబర్ 23 సాయంత్రం ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఈ ప్రత్యేక ప్రీమియర్ టికెట్ ధరను రూ.500గా నిర్ణయించగా, సింగిల్ స్క్రీన్లలో రూ.48, మల్టీప్లెక్సులలో రూ.94 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అలాగే రోజుకు ఐదు షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, చిత్ర నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి కోటి రూపాయలను అందజేసింది.