విద్యుత్ కొనుగోళ్ల పేరిట ట్రూఅప్ భారం: రేవంత్ సర్కార్ పై జగదీశ్‌రెడ్డి నిప్పులు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల పేరిట ప్రజలపై ట్రూఅప్ చార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు. 27 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ 20 వేల మెగావాట్ల డిమాండ్‌ను తీర్చలేకపోయిందని ఆరోపిస్తూ, విద్యుత్ సంస్థల కొనుగోలు ప్రతిపాదనలను తిరస్కరించాలని ఆయన ఈఆర్సీని కోరారు.