తొంభైల నాటి మధుర గానాలతో ప్రేక్షకులను అలరించేందుకు సింగర్ అభిజిత్ సావంత్ సన్నాహాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: ముంబై
ప్రముఖ గాయకుడు అభిజిత్ సావంత్ తొంభైల నాటి మధుర సంగీతంతో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తొంభైల నాటి పాటల మ్యాజిక్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఈ నైటీస్ బ్యాండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాత పాటల అందం, వాటిలోని అసలైన అనుభూతి వేరుగా ఉంటుందని, నేటి తరానికి కూడా ఆ మధురాన్ని పరిచయం చేయడమే తన ప్రధాన ఉద్దేశమని ప్రముఖ గాయకుడు అభిజిత్ సావంత్ పేర్కొన్నారు.