దుబాయ్ నుండి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో హైజాక్ కలకలం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: దుబాయ్
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానంలో హైజాక్ సంకేతాలు కలకలం రేపాయి. సౌదీ గగనతలంలో ఉండగా కాక్ పిట్ లో జరిగిన ఘర్షణలో పైలట్ గాయపడినట్లు ప్రయాణికులు తెలిపారు. అత్యవసర సంకేతాలు పంపిన ఆ విమానం సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.