థామస్ మార్కెల్ కేసులో ఎఫ్బీఐ ఎంట్రీ: ఫిలిప్పీన్స్ పోలీసుల సంచలన వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: Philippines
థామస్ మార్కెల్ సీనియర్ పై వచ్చిన ఆరోపణలపై ఎఫ్బీఐతో పాటు పలు అమెరికా అధికారిక సంస్థలు ప్రత్యేక దర్యాప్తు జరుపుతున్నట్లు ఫిలిప్పీన్స్ పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని, తగిన ఆధారాలు లభిస్తే అధికారికంగా కేసు నమోదు చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఇంకా రుజువు కాలేదని, ప్రస్తుతం మార్కెల్ అమెరికాలోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.