పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం: విదేశీ నిపుణుల బృందం నివేదికను సమీక్షించిన సీఎం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో విదేశీ నిపుణుల మార్గదర్శకం అత్యంత కీలకమని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి కేంద్రం నియమించిన విదేశీ నిపుణులు ప్రతి కీలకాంశంపై దృష్టి సారించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై వారు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ, పరీక్షల ఫలితాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.