విపక్షాల అబద్ధాలను తిప్పికొడుతూ వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ అంటూ అమిత్ షా

రిపోర్టర్: సురేష్ స్థలం: Telangana / New Delhi

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటమి ప్రచారం చేస్తున్న అబద్ధాలు, తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటూ బీజేపీ వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి ఉపఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.