'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజలతో ముఖాముఖి': ఇందిరా భవన్లో హార్కార వేణుగోపాల్ రావు కార్యక్రమం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'ప్రజలతో ముఖాముఖి' కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాల సలహాదారులు శ్రీ హార్కార వేణుగోపాల్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వినతులు స్వీకరించనున్నారు. గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో బుధవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.