కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: కిరణ్
స్థలం: చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో దాదర్-పుదుచ్చేరి ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అదనపు హాల్ట్‌ను ఘనంగా ప్రారంభించారు. సీఎం ప్రత్యేక విజ్ఞప్తి మేరకు రైల్వే బోర్డు ఈ హాల్ట్‌ను ప్రయోగాత్మక ప్రాతిపదికన మంజూరు చేయగా, ఈ ప్రారంభోత్సవం ద్వారా కుప్పం ప్రాంతవాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది.