ఆధార్ కార్డుదారులకు కీలక అప్డేట్: పేరు మార్పు నిబంధనలను సవరించిన యూఐడీఏఐ
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధార్ కార్డులో పేర్ల సవరణ ప్రక్రియను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పూర్తిగా మార్చింది. పాత నిబంధనలను సవరించి ఐదు ప్రత్యేక కేటగిరీలుగా ఈ విధానాన్ని విభజించినట్లు యూఐడీఏఐ అధికారులు వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా సవరణలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.