ఎమ్మెల్యేను కలిసిన మాందాపురం గ్రామపంచాయతీ పాలకవర్గం

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మాందాపురం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ ఆంజనేయులు గాడ్ సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.