ఆటోమొబైల్ రికార్డు: అక్టోబర్ లో దూసుకెళ్లిన కార్ల అమ్మకాలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
పండుగ సీజన్ జోష్ తో భారత ప్యాసింజర్ వాహన రంగం సరికొత్త రికార్డులను సృష్టించిందని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. అక్టోబర్ నెలలో దేశీయ కార్ల తయారీ సంస్థలు మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ విక్రయాలను సాధించాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహింద్రా, హ్యుందాయ్ వంటి ప్రముఖ దిగ్గజాలు రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. పండుగ డిమాండ్‌ను అందిపుచ్చుకుని కంపెనీలు భారీ అమ్మకాలతో సరికొత్త చరిత్ర సృష్టించాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.