నగరిలో వరుణ యాగం: వర్షాల కోసం 108 కలశాలతో వైభవంగా ఊరేగింపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరి దేశమ్మ గుడి దేవస్థానంలో వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు 108 కలశాలతో పట్టణంలో వైభవంగా ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు.