స్వాతి నక్షత్ర వేళ యాదాద్రిలో భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా వైభవంగా గిరిప్రదక్షిణ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి బీర్ల అనితతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద పాదపూజల అనంతరం వేలాది మంది భక్తులు, అర్చకులతో కలిసి కొండ చుట్టూ సామూహిక గిరిప్రదక్షిణ చేపట్టారు. స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంతం మార్మోగింది.