హైదరాబాద్లో విషాదం: దుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద రాజేష్ అనే యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెరువులోకి దూకి గల్లంతైనట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. తన సోదరుడు కనిపించడం లేదని, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సోదరి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి చెరువులో ముమ్మరంగా గాలిస్తున్నాయని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.