తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈనెల 7న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం రద్దీ దృష్ట్యా అక్టోబర్ 11 నుంచి 20 వరకు పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.