ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలి: ఖమ్మంలో జీఎస్టీ కార్యాలయం ఎదుట ధర్నా

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జీఎస్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులపై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. నాయకులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సంఘాలు ఖండించాయి. కార్యక్రమంలో మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి, చింతల రమేష్, మడుపల్లి లక్ష్మణ్, బుర్ర మనోజ్ తదితరులు పాల్గొన్నారు.