జపాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు, వరదలు

రిపోర్టర్: సురేష్ స్థలం: World

జపాన్‌లోని నాగోయా నగరంలో రికార్డు స్థాయి భారీ వర్షాలు కురిశాయి. కేవలం గంట వ్యవధిలోనే 104.5 మిమీ వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైలు పట్టాలపై నీరు చేరడంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.