భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించిన విప్ బీర్ల అయిలయ్య

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ ఈ వేడుకలను జరుపుకోవడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.