వైద్య రంగానికి దిశానిర్దేశం చేస్తూ ఖమ్మంలో ప్రారంభమైన రోగి భద్రతా వారోత్సవాలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 14 నుంచి 29 వరకు పేషంట్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ డి. రామారావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రోగి గుర్తింపు, మందుల వినియోగం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, శస్త్రచికిత్స భద్రత, రక్త మార్పిడి, వైద్య పరికరాల వినియోగంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.