హైదరాబాద్‌లో ఐ హేట్ మ్యారేజ్ సినిమా నుంచి అప్పుడే పెళ్లా పాట విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

సుగి విజయ్‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌ ప్రధాన పాత్రల్లో పరమేశ్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఐ హేట్‌ మ్యారేజ్‌. అక్టోబర్ చివరివారంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పుడే పెళ్లా పాటను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ విడుదల చేశారు. యువతకు తగిన సందేశంతో పాటు మంచి ఎమోషన్స్ ఉన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.