ఆమన్గల్లో ఆక్రమణల భరతం పట్టేలా మొదలైన భారీ జిఐఎస్ సర్వే

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

పురపాలక శాఖ ఆదేశాల మేరకు ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని ఆస్తుల సమగ్ర గుర్తింపు మరియు జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ నేటి నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. కమిషనర్ ఎస్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సాంకేతిక బృందం ఖాళీ స్థలాలు, భవనాలు, పార్కుల వివరాలను సేకరిస్తోంది. ఈ సర్వే ద్వారా ఆక్రమణలు తొలగిపోయి పరిపాలన పారదర్శకంగా మారుతుందని అధికారులు స్పష్టం చేశారు.