జూరాల వెళ్తుండగా బీజేపీ నేత రామచందర్ రావు అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
రైతుల ఆందోళనకు మద్దతుగా జూరాల ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలపై గళం విప్పుతున్న ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర పన్నుతోందని బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించాయి.