పెట్రోల్ బంక్ సీజ్ చేస్తుండగా ఐవోసీఎల్ మేనేనేజర్ దారుణ హత్య
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hingoli
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో పెట్రోల్ బంక్ సీజ్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ మేనేజర్ మహేష్ షెల్కేను కొందరు దుండగులు కత్తితో ఏడుసార్లు పొడిచి దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ శ్రేణిక్ లోధా తెలిపారు. చొంధి గ్రామంలో బంక్ స్వాధీనం చేసుకునే సమయంలో జరిగిన వివాదం హింసాత్మకంగా మారి ఈ ఘోరానికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇరవై నాలుగు గంటల్లోపే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.