అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్
రిపోర్టర్: సతీష్
స్థలం: జడ్చర్ల
జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. శుక్రవారం జడ్చర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పదేళ్లలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. భూ వివాదాలు, ఆసుపత్రి నిర్మాణంపై ఆరోపణలు నిరూపించాలని, లేదంటే ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో తెచ్చిన నిధుల వివరాలను ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.