యూనివర్సిటీల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచాలని టీడీఏ డిమాండ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
ప్రభుత్వ యూనివర్సిటీల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్యను పెంచాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. జీవో 31లో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాలని కోరుతూ మంగళవారం మసాబ్‌ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి చైర్మన్ కు వినతిపత్రం సమర్పించారు. కేవలం 429 పోస్టుల భర్తీతో సరిపెట్టకుండా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, స్థానికతకు ప్రాధాన్యం కల్పించేలా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని వారు స్పష్టం చేశారు.