పలాసలో విద్యుత్ తీగ తెగిపడగా పెను ముప్పును తప్పించిన స్థానిక యువకులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం జంక్షన్ వద్ద ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడటంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక యువకులు వాహనదారులను హెచ్చరించి పెను ప్రమాదాన్ని నివారించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టడంతో పెను ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.