కొండా సురేఖపై గుండు సుధారాణి సంచలన వ్యాఖ్యలు, తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: విజయ్ స్థలం: వరంగల్

కాంగ్రెస్‌లో అచ్చ, పచ్చ అంటూ ఏమీ లేవని, అంతా ఒకే జెండా, ఎజెండా అని కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికే కొండా సురేఖ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇకపై విమర్శలు చేస్తే సహించేది లేదని, దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.