'ఆమెను త్వరలోనే మరిచిపోతాం': ప్రిన్సెస్ డయానా సోదరుడి సంచలన పుస్తకం

రిపోర్టర్: మహేష్ స్థలం: World

ప్రిన్సెస్ డయానా మరణం తర్వాత ఆమె సోదరుడు చార్లెస్ స్పెన్సర్ తన రాబోయే జ్ఞాపకాల పుస్తకం 'స్వాన్ సాంగ్'లో సంచలన విషయాలు వెల్లడించారు. డయానా అంత్యక్రియల్లో ఆమె కుమారులు విలియం, హ్యారీ శవపేటిక వెనుక నడవడాన్ని తాను వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈ అంశంపై అప్పట్లో ప్రిన్స్ చార్లెస్ తనతో ఫోన్లో మాట్లాడుతూ, 'ఆమెను త్వరలోనే మరిచిపోతాం' అని కఠినంగా వ్యాఖ్యానించారని చార్లెస్ స్పెన్సర్ ఆరోపించడం బ్రిటన్ రాజ కుటుంబంలో కలకలం రేపింది.