ఆరోగ్య హెచ్చరిక: వయసు పెరిగితే ఎత్తు తగ్గడం ఆస్టియోపోరోసిస్ సంకేతమేనని నిపుణుల వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
వయసు పెరిగే కొద్దీ ఎత్తు తగ్గడాన్ని కేవలం సహజ మార్పుగా తీసిపారేయకూడదని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ రితేష్ ఖోఖర్ తెలిపారు. వెన్నుపూస బలహీనపడటం వల్ల ఎముకలు గుల్లబారే ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుందని, ఇది నిశ్శబ్దంగా వెన్నుపూస పగుళ్లకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో కీలకమని వైద్యులు స్పష్టం చేశారు.