ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యుల సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్ పరిధిలోని పాత్రికేయులంతా సమావేశమై నూతన పాలకమండలిని ఎన్నుకోవడం జరిగింది.
నూతన అధ్యక్షుడిగా చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శిగా నూతి సంతోష్ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, అక్రిడిటేషన్లు మరియు వారి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని నూతన అధ్యక్షులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.