తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
నర్సంపేట మున్సిపాలిటీలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పట్టణ మాజీ అధ్యక్షులు దేవోజు సదానందం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా తెలంగాణ తెగువను చాటిన ధీరవనిత అని కొనియాడారు. రజక సంఘం పట్టణ అధ్యక్షులు కొల్లూరి లక్ష్మీనారాయణ సహా పలువురు ప్రముఖులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.