ఓటర్లకు గుడ్ న్యూస్: ఓటు హక్ కు కోల్పోయిన వారికి మరో అవకాశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: కరీంనగర్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా పేరు గల్లంతైన అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. వివిధ కారణాలతో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేక జాబితాలో పేరు కోల్పోయిన వారు తిరిగి తమ ఓటు హక్కును పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ నెల 21వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.