పాలకవర్గాల్లో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
ట్రాన్స్ జెండర్లకు మున్సిపల్ పాలకవర్గాల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించినట్టుగానే, వికలాంగులకు కూడా స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న దివ్యాంగులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దివ్యాంగుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చి స్థానిక పరిపాలనలో తగిన భాగస్వామ్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.